హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగి ఆరుగురు మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ఘటనపై బీజేపీ కూడా స్పందించి, మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఎక్సైజ్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు, ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.