కల్యాణ లక్ష్మి కోసం.. 2023లో చనిపోయిన వ్యక్తికి 2024లో పెళ్లి.. ఇలా కూడా ఇస్తారా..!

4 hours ago 1
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మణుగూరు రెవెన్యూ విభాగంలో కల్యాణ లక్ష్మి పథకం అమలులో భారీ అక్రమాలకు తెరలేపారు. 2023లో ఆత్మహత్య చేసుకుని మరణించిన ఓ యువకుడిని ఏడాది తర్వాత బతికించి.. 2024లో అతనికి వివాహం జరిగినట్లు దొంగ ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. ఎలాంటి తనిఖీలు లేకుండానే రెవెన్యూ అధికారులు ఈ నకిలీ పత్రాల ఆధారంగా కల్యాణ లక్ష్మి లబ్ధి చేకూరుస్తూ చెక్కులు పంపిణీ చేశారు. ఈ వివాదాస్పద వ్యవహారంపై స్థానికులు ఉన్నతాధికారుల విచారణను కోరుతున్నారు.
Read Entire Article