తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత బోణీ కొట్టిన విషయం తెలిసిందే. ఆమె మద్దతుదారులు జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడ్డేపల్లి పురపాలికలో పోటీచేసి.. గెలిచారు. వీరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తుపై పోటీచేయగా.. విజయం వరించింది. అయితే, చివరకు ఆమెకు షాకిచ్చారు. వీరంతా సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. మరోవైపు, పలు చోట్ల హాంగ్ ఏర్పడటంతో ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల్లో గెలిచినవారిని చేర్చుకునే ప్రయత్నాలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లు చేస్తున్నాయి.