ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయాన్ని గణేష్ ఉత్సవ కమిటీ లెక్కించింది. గతంలో లేని విధంగా కళ్లు చెదిరేలా బడా గణేష్‌కు ఆదాయం సమకూరినట్లు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇక యాడ్స్ ద్వారా కూడా భారీగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. మరోవైపు.. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఈసారి సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు చేపట్టారు. రేపు ఉదయం ప్రారంభం కానున్న మహా గణపతి శోభాయాత్ర మధ్యాహ్నం 1.30 గంటలకు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం జరగనుంది.