ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలోని ఈడీ, సీబీఐ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదులైన ఈడీ, సీబీఐ వాదనలు వినకుండా మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.