మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా కష్టం వస్తే అందరూ తనను గుర్తుంచుకోండి అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలతో భేటీ అయిన జగన్.. వారికి అండగా ఉంటానని తేల్చి చెప్పారు. ఇక రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. ప్రతీ బుధ, గురువారాల్లో కార్యకర్తలతో గడపనున్నట్లు వెల్లడించారు. రోజుకు 3, 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.