హైదరాబాద్‌లో నిర్మాణాలు పెరగడం, పచ్చదనం తగ్గిపోవడం భూ ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణాలుగా పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకుల ఉపగ్రహ అధ్యయనం వెల్లడించింది. 2001 నుంచి 2021 మధ్య నిర్మాణాలు 34 శాతం పెరగ్గా, పట్టణ హరిత ప్రాంతాలు 42 శాతం తగ్గాయని వెల్లడించారు. పశ్చిమ పారిశ్రామిక ప్రాంతం ప్రధాన హీట్ స్పాట్‌గా మారిందని చెప్పారు. హుస్సేన్‌సాగర్, మూసీ నది పరివాహక ప్రాంతం, మీరాలం చెరువు చల్లదనాన్ని అందించే ప్రాంతాలుగా గుర్తించారు. భవిష్యత్తులో పచ్చదనం, జలవనరుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం సూచిస్తోంది.