కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి సొంత పార్టీ నాయకత్వంపై నిప్పులు చెరిగారు. కొందరు ఇంఛార్జులు పార్టీని చంపేయాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఫంక్షన్‌లో పాల్గొన్న జగ్గారెడ్డి.. ఏఐసీసీ కార్యదర్శి విష్ణుని నిలదీసినట్టు తెలుస్తోంది. అధికార పార్టీ ఎలా ఉండాలో తెలుసా.. ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అంటూ అటు విష్ణుతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీప్ దాస్ మున్షీ తీరుపై కూడా జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడినట్టు సమాచారం.