సాధారణంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో పని జరగాలంటే లంచం తీసుకోవడం గురించి వినుంటారు. కానీ ఓ గవర్నమెంట్ అధికారికి లంచంగా డబ్బులతో పాటు ఖరీదైన మద్యం కూడా కావాలట. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల సోదాలలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సోదాల్లో లెక్కల్లో లేని రూ.లక్షలను, విదేశీ మద్యం సీసాలను చూసి అధికారులే షాక్ తిన్నారు. కార్లో ఉంచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వీటిని ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.