Kakinada Three Murdered: కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాజులూరు మండలం శలపాకలో రెండు వర్గాలు కత్తులతో దాడి చేసుకోవడంతో ముగ్గురు చనిపోయారు. ఓ మహిళ విషయంలో ఇరువర్గాలు దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులు బత్తుల రమేశ్, బత్తుల చిన్ని, బత్తుల రాజుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.