కాకినాడ పేలుడు ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ఆర్డీఓతో పాటుగా.. డీఎస్పీ, డిస్టిక్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాద స్థలిని పరిశీలించిన చంద్రబాబు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.