Nadendla Manohar: కాకినాడ పోర్టు, విశాఖపట్నం పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వివరాలు వెల్లడించారు. బియ్యం అక్రమ రవాణాలో కొంత మంది సీనియర్ అధికారుల హస్తం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు కోటి ఇరవై టన్నుల బియ్యం అక్రమంగా తరలిపోయిందని వెల్లడించారు. విశాఖపట్నం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. కీలక వివరాలు తెలిపారు.