కాకినాడలో శుక్రవారం మధ్యాహ్నం పర్యటించిన పవన్ కళ్యాణ్.. యాంకరేజ్ పోర్టులో బార్జిలో తనిఖీలు చేశారు. ఇందులో రేషన్ బియ్యం ఎగుమతి అవుతుండడంతో ఇటీవల అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అధికారులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ మాఫియాకు మీరంతా సహకరించకపోతే ఇలా ఎలా దేశాలు దాటిపోతోందని ఆయన నిలదీశారు. ఉద్యోగాలు చేస్తున్నారా? మాఫియాకు వంత పాడుతున్నారా? అంటూ ప్రశ్నించారు. దీనిపై తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.