కాకినాడలో ఒక్కసారిగా పేలుడు.. భయంతో జనం పరుగులు

1 year ago 12
కాకినాడలోని బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో పేలుడు సంభవించింది. స్థానిక వార్పు రోడ్డులోని జై బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో పార్సిల్‌ దింపుతుండగా పేలుడు జరిగింది. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో హమాలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సంభవించేందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article