కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ లారీ బీభత్సం, నలుగురు కూలీలు మృతి

3 months ago 16
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ రూరల్ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు కాలినడకన వెళ్తున్న కూలీలపైకి ఒక అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Entire Article