కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై కేంద్రం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. కాజీపేట యూనిట్‌లో త్వరలోనే రైళ్ల తయారీని ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే వచ్చే 5 ఏళ్లలో కాజీపేట యూనిట్‌లో 200 రైళ్లను తయారు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై తాజాగా సమీక్ష నిర్వహించిన మంత్రి.. కీలక వ్యాఖ్యలు చేశారు.