కాణిపాకం ఆలయంలో అపచారం.. తెలియక చేశానన్న మహిళ..

5 months ago 32
కాణిపాకం ఆలయంలో అపచారం జరిగింది. అంతరాలయంలో ఫోటోలు తీయడం నిషేధం. అయితే ఇటీవల విదేశీ భక్తుల బృందం ఆలయాన్ని సందర్శించింది. ఈ బృందంలోని ఓ వ్యక్తి అంతరాలయంలో హారతి ఇస్తున్న సమయంలో ఫోటోలు తీశారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీనిపై భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావటంతో తీసిన మహిళ క్షమాపణలు తెలిపారు. తెలియక చేశానని.. క్షమించాలని కోరారు. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించినట్లు చెప్పారు.
Read Entire Article