తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలని రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రకాల చర్యలు చేపడుతోంది. పోలీసులకు కూడా కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే.. డ్రగ్స్ దందాను రూపుమాపేందుకు కృషి చేయాల్సిన పోలీసుల్లోనే ఒకరిద్దరు పక్కదోవ పడుతూ.. పాడుబుద్ది చూపిస్తున్నారు. కంచే చేను మోసిందన్న చందంగా.. మాదక ద్రవ్యాల సరఫరాను అరికట్టాల్సిన కానిస్టేబులే.. ఇంట్లోనే దుకాణం పెట్టేశాడు. అది కూడా పోలీస్ స్టేషన్ నుంచి నొక్కేసి మరీ.. దందా సాగిస్తున్నాడు. ఈ ఘటన వరంగల్ కాజీపేటలో చోటుచేసుకుంది.