పోలీసు స్టేషన్ పరిశీలనకు వెళ్లిన డీసీపీతో ఓ కానిస్టేబుల్ గొడవపడటం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నగరంలో కొత్తగా ఏర్పడిన పోలీసు స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సిబ్బందితో డీసీపీ రోల్ కాల్ నిర్వహించగా.. సివిల్ దుస్తుల్లో అదే పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆలస్యంగా వచ్చారు. దీంతో డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. కానిస్టేబుల్ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తిరగబడ్డాడు.