కామారెడ్డి: కవల సోదరులకు కవలలతో వివాహం.. పెళ్లైన నెల రోజులకే తీవ్ర విషాదం

1 month ago 5
కామారెడ్డి జిల్లాలో కవల సోదరులు, కవల సోదరీమణులను పెళ్లి చేసుకున్న ఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ ఇంట్లో నెల తిరగకుండానే విషాదం చోటుచేసుకుంది. కవల సోదరులలో ఒకరైన వినయ్.. వివాహమైన నెల రోజులు తిరగకుండానే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఉగాది పండుగ కోసం సొంతూరికి వెళ్లిన వినయ్.. కాలువలో శవమై కనిపించాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే పెళ్లై నెల తిరగకుండానే ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేదీ చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article