కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి శ్రుతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆధ్వర్యంలో పోలీసులు వెతకగా.. అదే చెరువులో ఎస్సై సాయికుమార్ మృతదేహం కూడా దొరికింది. ఈ ఘటన మిస్టరీగా మారింది.. ఈ ఘటనపై మరిన్ని వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు.