కామారెడ్డి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం చెలరేగింది. నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బాన్సువాడ పోలీసులు కొయ్యగుట్టు దగ్గర వాహనాలను తనిఖీ చేస్తుండగా.. పోలీసులను చూసి కొందరు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు వారిని పట్టుకున్నారు. వారిని చెక్ చేయగా నకిలీ కరెన్సీ వ్యవహారం బయటపడింది. వారి నుంచి పెద్ద మొత్తంలో ఫేక్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నకిలీ కరెన్సీ విలువ 56 లక్షలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు.