యాదగిరిగుట్ట ఆలయాన్ని మూసివేశారు. భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. కొండపై భిక్షాటన చేస్తున్న యాచకురాలిని.. కారు ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణం అయిన డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతితో దర్శనాలు నిలిపివేశారు. శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శనాలను పునరుద్ధరించనున్నారు.