ప్రభుత్వ పాఠశాల అంటే చాలా వరకు తల్లిదండ్రుల్లో చులకనభావం ఉంది. అక్కడ ఉపాధ్యాయులు సరిగా రారు.. పిల్లలకు పాఠాలు బాగా చెప్పరు.. పట్టించుకోరు అనే అభిప్రాయం పాతుకుపోయి ఉంది. ఒకప్పుడు అలాంటి పరిస్థితులు ఉండేవి ఏమో కానీ.. ఇప్పుడు చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు వస్తున్నాయి. గవర్నమెంటు పాఠశాల విద్యార్థులను ప్రైవేటు స్కూల్ స్టూడెంట్స్‌కి ధీటుగా తయారు చేస్తున్నారు టీచర్లు. తాజాగా విడుదలైన ఏపీ పదో తరగతి రిజల్ట్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు విశాఖపట్నం, నడుపూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌కి చెందిన విద్యార్థులు. 580 మార్కులకు పైగా సాధించి ప్రైవేటు స్కూల్స్‌కు తాము ఏమాత్రం తీసిపోమని నిరూపించుకున్నారు. ఆ విద్యార్థులను ఊరేగించి మరి.. ప్రభుత్వ పాఠశాల గొప్పతనం చాటుతున్నారు ఉపాధ్యాయులు. ఆ వివరాలు..