స్నేహం పేరుతో ఓ యువకుడు అమ్మాయికి దగ్గరయ్యాడు. మాయమాటలు చెబుతూ కొద్దికొద్దిగా నమ్మించసాగాడు. అదును చూసిన ఆ యువతిని అత్యాచారం చేసి ఆ పై నగ్నంగా ఫొటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. ఈ దారుణమైన సంఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పరిధిలో చోటుచేసుకుంది.