కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్యసభలో మాట్లాడిన కేంద్రమంత్రి.. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలం కావడానికి దాని ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణమని తేల్చి చెప్పారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ బృందం అధ్యయనం చేస్తోందని వెల్లడించారు. అదే సమయంలో జల్ జీవన్ మిషన్ నిధుల వినియోగంలో తెలంగాణ సర్కార్ తీరుపై ఆరోపణలు చేశారు.