కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో దెబ్బతిన్న బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అదే సమయంలో వానాకాలం మొదలు కాకముందే.. కీలక పరీక్షలు పూర్తి చేయాలని సర్కార్ డెడ్‌లైన్ విధించింది. బ్యారేజీ పునరుద్ధరణ పనులను చేపట్టి.. పాక్షికంగానైనా అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.