శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఇటీవల పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కార్తీక ఏకాదశి రోజున కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత కాశీబుగ్గ విజయ వెంకటేశ్వరస్వామి ఆలయం గురించి, ఆలయ నేపథ్యం గురించి, ఆలయాన్ని కట్టించిన హరిముకుంద పండా గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే హరిముకుంద పండా గురించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.