కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా శనివారం జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఈ ఆలయం 2 వేల మంది భక్తుల రద్దీని మాత్రమే తట్టుకోగలదు, కానీ శనివారం నాడు మాత్రం ఒకేసారి 15 వేల మందికి పైగా రావడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ప్రైవేటు ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు..