మారుతున్న జీవనశైలితో తెలంగాణలో కిడ్నీ సమస్యలు పెరిగిపోతున్నాయి. దేశంలోనే అత్యధికంగా, ప్రతి 100 మందిలో 7.4 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. హైబీపీ, షుగర్ ప్రధాన కారణాలు కాగా, ఊబకాయం, ఉప్పు-చక్కెర వాడకం కూడా దీనికి ఆజ్యం పోస్తున్నాయి. 30 ఏళ్లు దాటినవారు ఏటా కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.