కిలో చికెన్ రూ.150 అని కక్కుర్తిపడితే.. అమ్మబాబోయ్ అంతే సంగతులు!

3 hours ago 2
తిరుపతి నగరంలో కుళ్లిన చికెన్ అమ్మకాలు కలకలం రేపాయి. మున్సిపల్ అధికారుల తనిఖీల్లో కుళ్లిపోయిన చికెన్ అమ్ముతున్న వ్యవహారం బయటపడింది. దీంతో ఆ చికెన్ షాపుని సీజ్ చేశారు. బయట మార్కెట్లో కిలో 220 - 240 రూపాయలు ఉండగా..ఇక్కడ మాత్రం రూ.150కే విక్రయిస్తున్నారు. అలాగే అనారోగ్యంతో చనిపోయిన కోళ్లను డీప్ ఫ్రిజ్‌లో ఉంచి వినియోగదారులకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఈ కుళ్లిపోయిన చికెన్ తిని పలువురు వినియోగదారులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీనిపై ఫిర్యాదు అందడంతో మున్సిపల్ అధికారులు షాపును పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఫ్రిజ్‌లో కుళ్లిన చికెన్ దొరకడంతో అధికారులు అవాక్కయ్యారు. వెంటనే షాప్ సీజ్ చేశారు. మరోవైపు తక్కువ ధర చెప్పి ఇలాంటి చికెన్ అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తారా అంటూ స్థానికులు మండిపడుతున్నారు.
Read Entire Article