Dharmana Pa Murali Assets: మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ గొండు మురళి నివాసం, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు చేశారు. మురిళ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు. ఏకంగా రూ.70కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు.. బంగారం, విలువైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన బుడితి సీహెచ్‌సీలో ఉద్యోగం చేస్తున్నారు.