ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్‌లో నాలుగు సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది. అదే డిప్లొమా పూర్తి చేసిన వారు నేరుగా ద్వితీయ సంవత్సరంలో చేరి.. మూడు సంవత్సరాల్లో బీటెక్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే జేఎన్టీయూ అధికారులు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక నుంచి బీటెక్ రెండు సంవత్సరాలు చదివిన తర్వాత బయటకు వెళ్లిపోయే అవకాశం కల్పిస్తున్నారు . దీనికి డిప్లొమా సర్టిఫికేట్ కూడా అధికారులు ఇస్తున్నారు. అయితే పూర్తి డిగ్రీ పూర్తవ్వాలంటే.. 4 ఏళ్లు చదవాల్సిందే. వారు మళ్లీ అదే సర్టిఫికేట్‌తో.. జాయిన్ అయ్యే అవకాశం కూడా కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.