తెలంగాణలో అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) జాబితాలోకి మరో 14 కులాలను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ జాబితాలో 36 కులాలు ఉండగా.. కొత్తగా చేరే దాసరి, జంగం, పంబాల, వాల్మీకి బోయ వంటి కులాలతో కలిపి మొత్తం సంఖ్య 50కి చేరనుంది. ఈ మేరకు బీసీ కమిషన్ సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వం త్వరలో కేంద్రానికి పంపనుంది. దీనివల్ల సుమారు 11 లక్షల మందికి కేంద్రం నుంచి డీఎన్టీ (DNT) సర్టిఫికెట్లు లభిస్తాయి. తద్వారా విద్య, వైద్యం, గృహ వసతి కల్పించే కేంద్ర పథకం ‘సీడ్’ (SEED) ప్రయోజనాలు ఈ సంచార జాతులకు నేరుగా అందుతాయి.