తెలంగాణ దేవాదాయ శాఖ ఆలయాల అభివృద్ధికి.. భక్తుల సౌకర్యార్థం మెరుగైన వసతులకు ప్రణాళికలు రచించింది. ఈ నేపథ్యంలో.. తొమ్మిది ముఖ్య క్షేత్రాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి.. రూ. 779.74 కోట్ల నిధులు కేటాయించింది. మంత్రి కొండా సురేఖ ఈ పథకాలను ప్రకటించారు. ఆలయాల అభివృద్ధికి నిధులివ్వడమే కాక.. దేవాలయాల భూములను కాపాడేందుకు డిజిటలైజేషన్ మొదలుపెట్టారు. ఈ సంస్కరణలు దేవస్థానాల పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.