కుటుంబంలో ఎవరికైనా ప్రైవేటు ఉద్యోగం ఉంటే చేయూత పెన్షన్లకు అనర్హులు..?

3 weeks ago 14
తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్ల కోసం కొత్త దరఖాస్తులను స్వీకరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల వార్షిక ఆదాయ పరిమితి ఉన్నవారు అర్హులు. బాధితులు, వితంతువులు, తీవ్ర వ్యాధిగ్రస్తులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. అయితే, కుటుంబంలో ప్రైవేటు ఉద్యోగం ఉన్నా పింఛన్ వర్తించదన్న నిబంధనపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ వేతనాలు ఉండే ప్రైవేటు ఉద్యోగుల తల్లిదండ్రులకు ఇది అన్యాయమని, ఈ నిబంధనను సమీక్షించాలని సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు.
Read Entire Article