Old Man Protest For His Deposited Money In Society: తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో చిట్టూరి నర్సింహమూర్తి అనే ఓ రైతు నిరసనకు దిగారు. సహకార సంఘంలో డిపాజిట్ చేసిన తన డబ్బులు తిరిగి చెల్లించే వరకు కార్యాలయం వద్ద నుంచి కదిలేది లేదన్నారు. ఓ మంచం తీసుకొచ్చి అక్కడే పడుకున్నారు. ఆయనతో పాటుగా మరికొందరు కూడా అక్కడ నిరసనకు దిగారు.