Kumari Aunty Meet Revanth Reddy: "హాయ్ నాన్న.. ఏం కావాలి.. వెజ్జా, నాన్ వెజ్జా.." అంటూ తన ఫుడ్ స్టాల్‌కు వచ్చే కస్టమర్లను ఆప్యాయంగా పలకరిస్తూ.. రుచికరమైన భోజనాన్ని అందిస్తూ.. సోషల్ మీడియాలో సెలెబ్రిటీ అయిన కుమారి ఆంటీ.. తనలోని గొప్ప వ్యక్తిని అందరికీ పరిచయం చేసింది. తాను చేసుకునేది చిన్న స్ట్రీట్ వ్యాపారమే అయినా.. వరద బాధితులకు తన తాహతకు తగ్గట్టుగా సాయం ప్రకటించింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. వరద బాధితులకు సాయం అందజేసింది.