హైదరాబాద్ కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడే ఈ దారుణానికి ఒడిగట్టాడని తేల్చారు. క్రికెట్ బ్యాట్ దొంగతనానికి ప్రయత్నించిన బాలుడు.. సహస్ర అడ్డు రావడంతో హత్య చేశాడు. హారర్ సినిమాలు చూసే అలవాటున్న ఆ బాలుడు క్రికెట్ బ్యాట్ కోసం వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు.