" షిరిడీ సాయి ఆలయాల విషయంలో నా వ్యాఖ్యలు వక్రీకరించారు": ఆనం రామనారాయణ రెడ్డి

1 hour ago 1
Anam Ramanarayana Reddy Shirdi Sai Temple Comments: సాయిబాబా ఆలయాల గురించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రెండేళ్లలో దేవాదాయ శాఖ చేపట్టిన సంస్కరణలు, కార్యక్రమాలను వివరించేందుకు మంత్రి ఇటీవల విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీవాణి ట్రస్టు నిధులను కేవలం హిందూ ఆలయాల అభివృద్ధికే ఉపయోగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే షిరిడీ సాయి గురించి హిందూ పురాణాలు, ధర్మ శాస్త్రాలలో లేదంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలోనే తన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే మన్నించాలని కోరారు.
Read Entire Article