కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన కార్మికులు

5 hours ago 1
హైదరాబాద్‌ కూకట్‌పల్లి ప్రశాంత్‌ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు తయారుచేసే పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావటంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగి పరిశ్రమ అంతా వ్యాపించినట్లు కార్మికులు వెల్లడించారు. ముడిసరుకుతో పాటు అమ్మకానికి సిద్ధంగా ఉంచిన సరుకు మొత్తం బూడిదైందన్నారు. రెండు ఫైరింజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
Read Entire Article