కూకట్‌పల్లిలో రాయలోక్ ఫర్నిచర్ షాపు సీజ్.. అలా చేస్తున్నారనే కారణంతో..

1 month ago 5
హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో.. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైడ్రా ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ, ఫైర్, విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి.. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లను గోదాములుగా మార్చిన పలు ఫర్నిచర్ షాపులను సీజ్ చేశారు. దీనిలో భాగంగానే కూకట్‌పల్లిలోని రాయలోక్ ఫర్నిచర్ షాపును సీజ్ చేశారు. అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకోవడానికి వ్యాపార సంఘాలకు నెలరోజుల గడువు ఇచ్చారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Entire Article