Chandrababu Pawan Kalyan Madhav Meet Today: ఏపీలో స్థానిక ఎన్నికల సీట్ల పంపకాలపై కూటమి పార్టీల అధినేతలు నేడు సమావేశంకానున్నారు. ప్రధానంగా సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ కానున్నారు. చంద్రబాబు నివాసంలో జరుగనున్న ఈ సమావేశంలో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలో చర్చించనున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ప్రస్తుతానికి జనసేనకు మూడు, బీజేపీకి ఒక స్థానంపై చర్చ జరుగుతోంది.