విధి ఎంత బలీయమైనదో కొన్ని సందర్భాలు చూస్తే అర్థమవుతుంది. ఆనందంగా ఉండటం విధికి మింగుడుపడదా.. లేదా విధి లిఖితమో అర్థం కాదు కానీ.. కొన్ని సంఘటనలు గుండెలను మెలిపెడుతుంటాయి. అచ్చంగా అలాంటి ఘటనే జరిగింది హైదరాబాద్‌లో. రెండో సంతానంగా పండంటి అమ్మాయి పుట్టగా.. తమ ఇంటికొచ్చిన మహాలక్ష్మికి ఘనంగా బారసాల నిర్వహించారు ఆ తల్లిదండ్రులు. కానీ.. ఆ విధి మాత్రం ఆ చిట్టితల్లికి పెట్టిన పేరును కన్నతల్లి నోరారా పిలవక ముందే ఆ గొంతులోని ప్రాణాన్ని తీసుకెళ్లిపోయింది.