కృష్ణా నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కృష్ణా జిల్లా ఎదురుమొండి దీవుల ప్రజలు ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఏటిమొగ్గ – ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ వంతెన నిర్మాణానికి నాబార్డు నిధులు కేటాయించిందన్న పవన్.. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటుగా సాస్కీ నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు.