బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ వెన్నుముకకు గాయమైందని స్వయంగా వెల్లడించారు. వైద్యులు విశ్రాంతి సూచించడంతో, కొద్దిరోజులు ప్రజలకు దూరంగా ఉండనున్నారు. వరంగల్ సభలో పాల్గొన్న కొద్ది రోజులకే ఇది జరగడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే, త్వరలోనే కోలుకొని ప్రజల్లోకి వస్తానని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇంతకీ జిమ్ లో ఏం జరిగింది? కేటీఆర్ ఎలా గాయపడ్డారు?