తెలంగాణ రాజకీయాల్లో బిగ్ బ్లాస్ట్ నమోదైంది. గత కొంతకాలంగా తీవ్ర చర్చ నడుస్తున్న ఫార్ముల్ ఈ- రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ.. కేటీఆర్ మీద మొత్తం నాలుగు నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ పేర్కొంది