అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య జరిగిన ఉద్రిక్తతకు సంబంధించి సైఫాబాద్ పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, సుధీర్‌రెడ్డి, నవీన్‌రెడ్డిలపై కేసు నమోదైంది. మహిళా పోలీసులను దూషించడం, బెదిరించడం, విధులకు ఆటంకం కలిగించడం, అనుచితంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు ఫిర్యాదులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.