బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. గత నెల 31న బెల్ ఆఫ్ ఆర్మ్స్ నుంచి ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్ చోరీకి గురైన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. రెజిమెంట్‌లో పనిచేసిన హవల్దార్ మల్లేశ్ అలియాస్ రాజుపై అనుమానం పెంచుకున్నారు. అతడి కదలికలను పరిశీలించి విచారించగా.. చివరికి అతడి భార్య నిలదీయడంతో చోరీని అంగీకరించినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.