హైదరాబాద్ కేబీఆర్ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు చేపడుతున్న ఏడు ఫ్లైఓవర్లు, ఆరు అండర్‌పాస్‌ల నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. మే 18న విధించిన స్టేను తొలగించాలని విజ్ఞప్తి చేసింది. పనులు కేబీఆర్ ఎకోసెన్సిటివ్ జోన్‌లో జరగడం లేదని, పార్కుకు ఇబ్బంది లేకుండా ప్లైఓవర్ల డిజైన్లు మార్చామని తెలిపింది. 2031 నాటికి రోజుకు ఆరు లక్షల వాహనాలు తిరిగే అవకాశం ఉందని పేర్కొంది. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ సెప్టెంబరు 7కు వాయిదా పడింది.